Blind Girl Gets PHD: అంగవైకల్యం అనేది అభివృద్ధికి, ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం కాదని ఎంతో మంది రుజువు చేశారు.. ఇప్పటికీ చాలా మంది రుజువు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో అంధుల గురించి గొప్పగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కళ్ళు లేకపోతే సాధారణంగా బయటే కాదు.. ఇంట్లో కూడా తిరగలేము. కళ్ళున్న వారు చదవాలంటేనే కష్టపడతారు.. అలాంటిది కళ్ళు లేకున్నా పట్టుదలతో చదవడం.. అందులోనూ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్‌డీ) పట్టాను సాధించడం సామాన్య విషయం కాదు. కానీ అంతటి ఘనతను ఛత్తీస్‌గడ్‌కు చెందిన అంధురాలైన దేవశ్రీ భోయర్ సాధించింది. తనకు జన్మనిచ్చిన తండ్రి సహకారం అందించడంతో దేవశ్రీ ఈ ఘనతను సొంతం చేసుకుంది.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఛత్తీస్‌గడ్ లోని రాయపూర్ పరిధిలో గల గుడియాపరిలోని జనతా కాలనీకి చెందిన అంధురాలు దేవశ్రీ భోయర్ పీహెచ్‌డీ పట్టా పొందింది. తాను సాధించిన విజయాన్ని తన తల్లిడండ్రులకు అంకితమిస్తున్నట్టు ప్రకటించింది. అమ్మా, నాన్న తనలో నమ్మకాన్ని మరింతగా పెంపొందించారని.. తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు. వారిసాయంతోనే తాను ఈ విజయాన్ని సాధించానని తెలిపారు. పుట్టుకతోనే అంధురాలైన దేవశ్రీ పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాను అందుకుంది. ఈ సందర్భంగా దేవశ్రీ మాట్లాడుతూ తన తండ్రి ఒక చిన్న దుకాణం నడుపుతున్నాడని.. తామందరం ఒక చిన్న ఇంటిలో ఉంటున్నట్టు చెప్పారు. తన తండ్రి నడిపే దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతోనే తమ కుటుంబం గడుస్తుందని తెలిపారు. తన తండ్రి దుకాణం నడుపుతూనే తనకు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. ఒక్కోరోజు అయితే ఏకంగా 10 గంటలపాటు తన తండ్రి తన దగ్గరే కూర్చొని చదివించిన రోజులు కూడా ఉన్నాయన్నారు. పీహెచ్‌డీ పట్టా పొందడానికి నాన్న రాత్రివేళ మేల్కొని ధీసెస్ రాసేవారని గుర్తు చేశారు. తాను 10వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ తన కుమార్తెను పీహెచ్‌డీ పూర్తి చేయడానికి కృషి చేశానని దేవశ్రీ బోయర్ తండ్రి తెలిపారు.
