గుజరాత్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలుపుతోంది. గుజరాత్ ప్రాంతంలోని ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, నవ్‌సారి, సౌరాష్ట్ర-కచ్‌లోని జామ్‌నగర్, పోర్ బందర్, జునాగఢ్, అమ్రేలీ, గిర్ సోమనాథ్, కచ్‌తో పాటు డయ్యూలో రాబోయే 5 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గుజరాత్ తీరంలోని మత్స్యకారులు ఈనెల 26 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని భారత వాతావరణ విభాగం, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సూచించింది.
Etela Rajender : తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీలు కేసీఆర్ ఎందుకు నెరవేరుస్తలేరు
మరోవైపు భారీ వర్షాల ధాటికి గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఓ రెండు అంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. దీంతో ఆ భవనం శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని దాతర్ రోడ్‌లోని కడియావాడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో.. బిల్డింగ్ పాతది కావడంతో కూలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు శిథిలాల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
