Rainbow Childrens Hospital: విశాఖపట్నంలోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ నిపుణుల బృందం నగరంలోని ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో కేవలం 33 వారాల నెలలు నిండని కవల శిశువును కాపాడే శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. కేవలం 1.5 కిలోల బరువున్న శిశువుకు పుట్టుకతో వచ్చే గ్లాకోమా, తీవ్రమైన గుండె పరిస్థితిని గుర్తించారు. కేవలం 14 రోజుల వయస్సులో, శిశువుకు PDA (పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్) లిగేషన్ కార్డియాక్ సర్జరీ జరిగింది. ఈ సున్నితమైన ప్రక్రియ పుట్టిన తర్వాత నిర్వహించారు. డాక్టర్ చౌహాన్ అభినవ్‌సింగ్ ఎ, పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన, రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. విశాఖపట్నంలోని ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్. దివ్య దంగేటి, డాక్టర్. శివాని కొడాలి 24 గంటల్లో, శిశువుకు రెండు కళ్లకు గ్లాకోమా శస్త్రచికిత్స నిర్వహించి శాశ్వత అంధత్వాన్ని నివారించడంలో సహాయపడ్డారు.
Also Read: West Indies vs Bangladesh: సొంతగడ్డలో వెస్టిండీస్‌కు ఘోర అవమానం.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్
తమ బిడ్డ క్లిష్ట పరిస్థుతలను నైపుణ్యంగా ఎదుర్కొని త్వరితంగా నిర్ణయాలు తీసుకుని బిడ్డలా జీవితాలను కాపాడినందుకు తల్లిదండ్రులు అమితానందం పొందారు. తమ పిల్లల జీవితాన్ని కాపాడినందుకు కార్డియాలజిస్ట్, NICU బృందానికి ధన్యవాదాలు తెలిపారు. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని NICU (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ టీమ్), డాక్టర్ మందుల ఫణి ప్రియ, కన్సల్టెంట్ DM నియోనాటాలజిస్ట్, డాక్టర్ సతీష్ వాడపల్లి, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్, డాక్టర్ బాల శ్రీలత పులి, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్‌లు శిశువులను రక్షించాతంలో కీలక పాత్ర పోషించినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “ఇది అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలు మాత్రమే కాదని ఇది ఒక అద్భుతమైన విజయగాథ అని తెలిపారు. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మన నగరంలో ప్రపంచ స్థాయి సంరక్షణను అందిస్తున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. మా నిపుణుల బృందం ఈ బిడ్డకు అత్యుత్తమ జీవన అవకాశం అందించుటకు సజావుగా కలిసి కట్టుగా పనిచేసిందని పేర్కొన్నారు. అతి తక్కువ వ్యవధిలో ఈ డబుల్ చికిత్సలను విశాఖపట్నంలో నిర్వహించటం నియోనాటల్ కేర్ నాణ్యతకు నిదర్శనం. ఇది అకాల మరియు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాల వారికి ఆశాజ్యోతిగా మారుతుందన్నారు.
Also Read: Alzheimer: ఆ పనులు చేసేవారికి అల్జీమర్స్ బారినపడే అవకాశం తక్కువట!
25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రముఖ చైన్ హాస్పిటల్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అధునాతన నియోనాటల్ కేర్, పీడియాట్రిక్ సేవలకు ప్రసిద్ధి చెందింది. ప్రసుత కేసు ఈ ప్రాంతంలో ప్రముఖ ఆరోగ్య సంరక్షణ ప్రదాతగా రెయిన్ బో హాస్పిటల్ పాత్రను మరింత హైలైట్ చేస్తుంది. అత్యాధునిక NICU, అంకితమైన పీడియాట్రిక్ కార్డియాక్ సంరక్షణా బృందం, నిపుణుల సహకార నెట్‌వర్క్‌తో తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి అసాధారణమైన ఆరోగ్య ఫలితాలను అందజేస్తూనే ఉంది రెయిన్ బో హాస్పిటల్.