NTV Telugu Site icon

Rainbow Childrens Hospital: ప్రతిష్ఠాత్మకమైన జేసీఐ అక్రిడిటేషన్‌ పొందిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్

Rainbow

Rainbow

Rainbow Childrens Hospital: భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్, ఉమెన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ అయిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్.. జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI) నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గోల్డ్ సీల్ ఆఫ్ క్వాలిటీ అప్రూవల్’ని పొందినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ ఫెసిలిటీ నాణ్యతను ఈ అక్రిడిటేషన్ గుర్తించినట్లు హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది. ప్రపంచ స్థాయిలో అసాధారణమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో హాస్పిటల్ అంకితభావం ఈ గుర్తింపు ద్వారా మరొకసారి నిరూపితమైనట్లు తెలిపింది. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్స్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసిన ఖచ్చితమైన ప్రమాణాలతో మెరుగైన, అధునాతన వైద్యం అందిస్తోందని ఈ అక్రిడెటిటేషన్ నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఈ అక్రిడిటేషన్‌ను పొందడానికి మొత్తం ఆసుపత్రి నిబద్ధత పాటించడంతో పాటు జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI) ద్వారా నిర్దేశించబడిన 13 అధ్యాయాలు,1200 కొలవదగిన అంశాల చెక్‌లిస్ట్‌ను పాటిస్తున్నట్టు నిరూపణనివ్వాలి.

ఈ ఘనతను అందుకోవటంపై రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బర్త్‌రైట్ బై రెయిన్‌బో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల హర్షం వ్యక్తం చేశారు. “మేము ఎల్లప్పుడూ నాణ్యమైన సంరక్షణను అందించడాన్ని విశ్వసిస్తుంటాము. ఈ అక్రెడిటేషన్ సాధించడం, రెయిన్‌బో కుటుంబంలోని ప్రతి ఒక్కరి విజయం. ఈ గుర్తింపు మా టీం వర్క్‌కు ప్రతీక. అంతేకాదు, మా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అందించిన ప్రేమతో కూడిన సంరక్షణ, ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పని చేయడంలో మా సమిష్టి కృషికి, నిబద్ధతకు ఈ విజయం నిదర్శనం. మేము, మా రోగులకు భద్రత యొక్క అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. ” అని డాక్టర్ రమేష్ కంచర్ల అన్నారు. ఇంతకుముందు, కొండాపూర్‌లోని బర్త్‌రైట్ ఫెర్టిలిటీ బై రెయిన్‌బో హాస్పిటల్స్‌కు జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI) గుర్తింపు లభించిందన్న విషయం విదితమే.

Also Read: Aurangzeb Picture: వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఔరంగజేబు ఫొటో.. నవీ ముంబై వ్యక్తి అరెస్ట్!

“మా లక్ష్యం అసాధారణమైన రీతిలో పీడియాట్రిక్ కేర్ అందించటం. మేము మొదటి నుండి, ఒక బృందంగా, అంచనాలను అధిగమించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాము. మేము, సమిష్టిగా , మా విస్తృతమైన పరిజ్ఞానం, ఉత్తమ అభ్యాసాలకు కట్టుబడి ఉండటం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, అర్హత కలిగిన వైద్య నిపుణులు, పారామెడిక్ సిబ్బంది మరియు చికిత్స ప్రోటోకాల్‌ల ద్వారా దీనిని సాధించాము.” అని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ డైరెక్టర్, డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల అన్నారు.

రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ 1999లో ఏర్పాటై, ఇప్పటికి, రెండు దశబ్దాలకు పైగా అనుభవంతో, క్లినికల్, నాన్-క్లినికల్ విధానాలలో గ్లోబల్ క్వాలిటీని కష్టపడి నిర్మించింది, తమ రోగులకు అందించే సేవల్లో నాణ్యత, భద్రతలో ఉన్నత ప్రమాణాలను నిర్వహిస్తోంది. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇదే ప్రమాణాలతో దేశవ్యాప్తంగా 6 నగరాలలో 16 బ్రాంచీలలో చిన్నపిల్లలు, స్త్రీలకు సేవలందించడం గమనార్హం.

Show comments