నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ.. ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలేలా ఉన్నాడు. హైదరాబాద్ లో బీభత్సమైన వర్షం కురుస్తుంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొడుతుంది. ఈ క్రమంలో.. ఈరోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో.. సన్ రైజర్స్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముందుజాగ్రత్తగా ఉప్పల్ స్టేడియంలో పిచ్ను గ్రౌండ్ సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. ఔట్ ఫీల్డ్లో కూడా చాలా భాగం కవర్లతో కప్పివేశారు.
Ilayaraja: ఇళయరాజా పారితోషికం తీసుకోకుండా మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఏంటో తెలుసా?
ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్కు వెళ్లాలనుకున్న సన్ రైజర్స్ టీమ్కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఈరోజు జరగాల్సిన మ్యాచ్‌లో జీటీని ఎస్ఆర్హెచ్ ఓడిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు ఢిల్లీతో పాటు లక్నో ఇంటిదారి పడుతుంది. ఇక చివరి స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడాల్సి ఉంటుంది. అయితే.. ఈ రోజు జరిగే మ్యాచ్ రద్దయి ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తే.. హైదరాబాద్ (15 పాయింట్లతో) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.
Sharad Pawar: సంక్షోభ సమయంలో మోడీకి సాయం చేశా.. శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు..
ఇక.. పంజాబ్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే టాప్ 2కి వచ్చే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌లో కోల్‌కతా మీద ఓడిపోతేనే ఇది సాధ్యమవుతుంది. ఇక గుజరాత్ 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి వస్తుంది. అయితే.. చెన్నై – బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు కూడా వర్షం గండం ఉన్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ కూడా రద్దయితే చెన్నై (15 పాయింట్లతో) ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. బెంగళూరు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కాదు.. ఒకవేళ మ్యాచ్ జరిగి చెన్నై భారీ తేడాతో ఓడితే బెంగళూరు ప్లేఆఫ్స్‌కు వచ్చే అవకాశం ఉంది.