Site icon NTV Telugu

IPL 2023 : ఆర్సీబీకి వర్షం ముప్పు.. ప్లే ఆఫ్స్ కు చేరేనా..?

Rcb

Rcb

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఇప్పటికే గుజరాత్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరిన నేపథ్యంలో ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా ఆ టీమ్ కు పెద్దగా నస్టం ఏమీ ఉండదు. అయితే.. బెంగళూరు జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఓడిపోతే ఇక ఇంటికి వెళ్లిపోవాల్సిందే..

Also Read : Somu Veerraju : రూ. 2000 నోటు రద్దు నిర్ణయం మోడీ సాహసోపేత నిర్ణయం

ఈ నేపథ్యంలో టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటాన్స్ పై బెంగళూరు ఘన విజయం సాధించాలని ఆ టీమ్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంకొందరు అయితే ఏకంగా పూజలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారిని ఓ విషయం కలవర పెడుతుంది. అదేంటి అని ఆలోచిస్తున్నారా.. ఈ మ్యాచ్ కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో వర్సం కురిస్తే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

Also Read : Anasuya: బికినీలో అనసూయ.. పిల్లల ముందు ఏంటీ ఈ చండాలం

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ తెలిపింది. ఈ విష‌యం తెలిసిన అభిమానులు ఇప్పుడు కంగారు ప‌డుతున్నారు. ఒక వేళ వ‌ర్షం ప‌డి మ్యాచ్ ర‌ద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింటును ఇస్తారు. అప్పుడు బెంగ‌ళూరు 15 పాయింట్లతో ఉంటుంది. అదే స‌మ‌యంలో స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో ముంబై విజ‌యం సాధిస్తే 16 పాయింట్లతో రోహిత్ సేన ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. అందుక‌నే వ‌ర్షం ప‌డ‌కుండా మ్యాచ్ స‌జావుగా జ‌రిగి, బెంగ‌ళూరు విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాల‌ని స‌గ‌టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమాని కోరుకుంటున్నారు.

Exit mobile version