NTV Telugu Site icon

Ind vs Nz 2nd odi: ఆటకు అడ్డంకిగా మారిన వరుణుడు.. కొనసాగడం కష్టమే!

India Vs New Zealand

India Vs New Zealand

Ind vs Nz 2nd odi: హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అడ్డు తగిలాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో కివీస్‌ విజయం సాధించగా.. ఈ మ్యాచ్‌ భారత్‌కు ఎంతో కీలకం. 4.5 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆట ఆగిపోయే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (2), శుభమన్ గిల్ (19) క్రీజులో ఉన్నారు. రెండో వన్డేలో సంజూ శాంసన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ల స్థానంలో దీపక్‌ హుడా, దీపక్‌ చాహర్‌లను తీసుకురావడంతో భారత్‌ రెండు మార్పులు చేసింది. ఆదివారం జరిగే మూడు వన్డేల సిరీస్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతోంది. మొదటి వన్డేలో బ్లాక్‌క్యాప్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టామ్ లాథమ్ 104 బంతుల్లో 145 నాటౌట్‌గా నిలవడంతో కివీస్ తొలి వన్డేలో భారత్‌పై 307 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Ind vs Nz: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్

వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉండడంతో అంతకుముందు టాస్ కూడా వాయిదా పడింది. ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైన భారత జట్టుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. సిరీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి. అయితే, మ్యాచ్ మాత్రం కొనసాగేలా కనిపించడం లేదు. హమిల్టన్‌లో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉండడమే అందుకు కారణం. వన్డే సిరీస్‌ రేసులో నిలవాలంటే భారత్‌ తప్పక నెగ్గాల్సిందే. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యం నిర్దేశించినా ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో హామిల్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో తలపడుతోంది. టాస్‌ నెగ్గిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకొన్నాడు. వర్షం ప్రభావం కారణంగా హామిల్టన్ మైదానం కాస్త చిత్తడిగా మారింది. దీంతో టాస్‌ ఆలస్యమైంది. స్వదేశంలో వరుసగా 13 వన్డేలు గెలిచిన కివీస్‌ను అడ్డుకోవడం భారత్‌కు సులువేం కాదు.