Rains: ఐదు రోజుల పాటు వర్షాలు.. ఎల్లో, ఆరేంజ్ అలర్ట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rains: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండు మూడు రోజుల కిందటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఇప్పుడు ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 10 నుంచి వాతావరణం చల్లబడటం ప్రారంభించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా ఉన్నాయి. తెలంగాణపై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురవచ్చు. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
Read Also: KCR: లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్.. నేడు చేవెళ్ల నుంచి ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు ఆరెంజ్‌తో పాటు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. అటు.. దేశవ్యాప్తంగా కూడా ఎండలు కాస్తా తగ్గాయి. కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. తమిళనాడులో వరుణుడు కరుణించాడు. మండుతున్న ఎండల నుంచి అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగించాడు. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. రాజధాని చెన్నైలో కూడా రెండురోజులపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను దాటకపోవచ్చని అంచనా వేసింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?