AP Rains: ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాలపై ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Rains: ఎండలు దంచికొడుతున్నాయి.. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. ఎండలకు తీవ్రమైన వడగాల్పులు తోడు కావడంతో.. ఏపీ ప్రజలు అల్లాడి పోతున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్ష సూచన ఉందంటోంది అమరావతి వాతావరణ కేంద్రం.. ఎల్లుండి ఏపీలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అమరావతి వాతావరణ కేంద్రం.. ఇక, మిగతా చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని సూచించింది.. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పతున్నాయని.. ఆదివారం, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయల సీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. అయితే, ఈ రోజు మాత్రం రాష్ట్రంలోని 247 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మరో వైపు.. ఇప్పటికే తిరుపతి, తిరుమల సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తిరుమలలో అయితే.. గత మూడు రోజులుగా వర్షాలు కురిస్తున్నాయి..
Read Also: Hardeep Nijjar killing: నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్టుపై స్పందించిన విదేశాంగ మంత్రి
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..