Site icon NTV Telugu

Rain In Hyderabad : హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..

Rain In Telangana

Rain In Telangana

భారత వాతావరణ విభాగం – హైదరాబాద్ (IMD-H) ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే.. బుధవారం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసింది. ఇప్పటికే వేసవి తాపానికి మండిపోతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, మణికొండ, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, సికింద్రాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. మాసబ్‌ట్యాంక్, నాంపల్లి, లక్డికాపూల్‌, మాదాపూర్‌, హైటెక్ సిటీ, మెహిదీపట్నం, టోలీచౌకిలో భారీ ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

Also Read : Mission Teaser: అసలు ఏ ‘మిషన్’ కోసం జైలుకు వెళ్ళావ్ భయ్యా..

గురు, శుక్రవారాల్లో హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని IMD-H అంచనా వేసింది. నగరంలో శనివారం పాక్షికంగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు నగరం సగటు గరిష్ట ఉష్ణోగ్రత 37 మరియు 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని IMD అంచనా వేసింది. ఏప్రిల్ 9 నుండి, వాతావరణం వేడిగా మారుతుందని అంచనా వేసింది. ఇదేకాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురిసాయి. అయితే. ఈ అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read : Sabitha Indra Reddy : మీ స్వార్ధ రాజకీయాల కోసం విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతారా

Exit mobile version