తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్, లకిడికపూల్, అబిడ్స్, నాంపల్లి, గోషామహల్, నాంపల్లి, కోఠి, బేగంబజార్ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read : Whatsapp New Features: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్స్..ఆన్లైన్ ఆర్డర్స్ తో పాటు..
వాయువ్య బంగాళాఖాతం సమీపంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడుతోంది. దానితో సంబంధం ఉన్న కాలం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉంది. వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Also Read : Faria Abdullah : స్లీవ్ లెస్ టాప్ లో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
ఇదిలా ఉంటే.. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఓ మోస్తరు వానలు కురిశాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో 62.5 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 62.5 మీ.మీ వర్షపాతం నమోదైంది. అలాగే.. మెదక్ జిల్లా శివ్వంపేట లో 62.3 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్ వర్షం దంచికొట్టింది. సిర్పూర్ టి మండలం వెంకట్రావ్ పేటలో 114.3 మి.మీ వర్షపాతం నమోదు నమోదైంది. అలాగే.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్ రోడ్ లో 80.8మిమీ.. మంచిర్యాల జిల్లా బీమినిలో 55.3 మిమీ.. నిర్మల్ జిల్లా ముజ్గీలో 29.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.