NTV Telugu Site icon

Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన

Heavyrain

Heavyrain

దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతాలు, ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Double Ismart: ఇప్పుడేం మాట్లాడను.. ఆరోజే మాట్లాడతా.. ఛార్మీ కౌర్

గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది. హైదరాబాద్‌లో రేపు ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తర్వాత జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. మధ్యాహ్నం కాస్త ఎండ వచ్చినప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించింది.

Rajeev Chandrasekhar: కాంగ్రెస్‌కి ‘‘హిండెన్‌బర్గ్’’ సంబంధం.. ఇది సెబీపై దాడి..