Site icon NTV Telugu

Rain Alert: ఏపీకి వర్షసూచన.. రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు

Rains

Rains

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1 .5 కి.మీ.ఎత్తులో పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు.. ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా కొనసాగుతోంది దీంతో ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ / నైరుతి గాలులు వీస్తున్నాయి.

ఉత్తర కోస్తాతో పాటు యానాంలో బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

Read Also: CM JaganMohan Reddy: చంద్రబాబుపై జగన్ సెటైర్లు..పంచతంత్రం కథ చెప్పిన సీఎం

దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Exit mobile version