Rain Alert: ఈ మూడు రోజులు అలర్ట్.. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్ష సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert in Andhra Pradesh & Telangana for 3 Days: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాజా వివరాల ప్రకారం.. ముఖ్యంగా నేడు, రేపు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మేఘావృత వాతావరణంతో పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇక తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, సూర్యపేట, వరంగల్, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని సూచించారు. రైతులు, ప్రయాణికులు సైతం వాతావరణ పరిస్థితులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
READ MORE: IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీయల్
Also Read
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వర్షం వచ్చేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడకూడదు. ముఖ్యంగా ఎత్తయిన చెట్ల కింద అస్సలు ఉండొద్దు. వాటికి పిడుగు ముప్పు మరింత ఎక్కవని గమనించాలి. ఇంటి ఆవరణలో భూమిలోపల ఉప్పు, కర్ర బొగ్గు, రాగి వైరుతో ఎర్త్ ఏర్పాటు చేయించడం ద్వారా ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది. మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, తదితర విద్యుత్ గృహోపకరణల ప్లగ్స్ స్విచ్ బోర్డు నుంచి తీసివేయాలి. పిడుగులు తాటి చెట్లు, విద్యుత్ స్తంభాల మీద ఎకువగా పడుతుంటాయి. కాబట్టి వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. ఒక్కోసారి పిడుగు పడ్డ ప్రదేశంలోనే మరోసారి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్లకూడదు. వర్ష సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోర్డులు, కెమెరాలు, సెల్‌ఫోన్లు దగ్గర ఉంచుకోక పోవడం చాలా మంచిది. పశువులను గుడిసెలు, కొట్టాలు, షెడ్లలో కట్టివేయాలి. చెట్ల కింద ఉంచ్చొద్దు. ఉరుములు, మెరుపులతో వర్షం పడినప్పుడు రైతులు పొలాల వద్ద ఉండకూడదు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!