IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీఎల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అటు థియేటర్లు సినిమాలతో, ఇటు టీవీలు క్రికెట్ మ్యాచ్‌లతో సందడిగా ఉంటాయి. అయితే ఈ ఏడాది IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్లపై తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వీకెండ్‌లో వస్తున్న భారీ మ్యాచ్‌ల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గడంతో, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు సైతం వసూళ్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Also Read : Lip Kiss Incident : స్టార్ హీరోయిన్‌కు పబ్లిక్ వేదికపై బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని
Also Read
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘ధురంధర్ 2’ చిత్రానికి ఐపీఎల్ పెద్ద అడ్డంకిగా మారింది. వీక్‌డేస్‌లో రోజుకు సగటున రూ. 20 కోట్లు వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం వీకెండ్‌లో మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని భావించారు. కానీ గత శనివారం రూ. 27 కోట్లు, ఆదివారం రూ. 30 కోట్లు వసూలు చేసినప్పటికీ అంచనాల కంటే ఇది చాలా తక్కువ. వీకెండ్‌లో క్రేజీ మ్యాచ్‌లు ఉండటంతో క్రికెట్ ప్రేమికులు బయటకు రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఐపీఎల్ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా కనీసం రూ. 10-15 కోట్లు వసూళ్లను కోల్పోయినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
టాక్ బాగున్నా.. కలెక్షన్లు శూన్యం :
ఇక తాజాగా విడుదలైన ‘రాకాస’, ‘బైకర్’ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ లభించింది. ‘బైకర్’ రివ్యూ రేటింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఐపీఎల్ ఫీవర్ వల్ల కలెక్షన్లలో ఆ జోరు కనిపించడం లేదు. రాకాస ఈ వీకెండ్‌కే బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో 4-5 రోజులు పట్టేలా ఉంది. ఈ నెల 10న ‘డెకాయిట్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ‘ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సమ్మర్ సీజన్ కావడంతో భారీ వసూళ్లు వస్తాయని మేకర్స్ ఆశించినా. ఐపీఎల్ అడ్డు తగులుతుండటంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా, సాయంత్రం వేళల్లో జరిగే మ్యాచ్‌ల వల్ల కలెక్షన్లకు గండి పడుతోంది. దాంతో ఎంతో ఉత్సాహంగా సాగాల్సిన సమ్మర్ సినిమా సీజన్ ఐపీఎల్ ధాటికి వెలవెలబోతోంది.
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!