Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!

Ap Rain

Ap Rain

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వర్ష సూచన జారీ చేసింది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరోవైపు నెల్లూరు జిల్లా కావలిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీనితో ఆ ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సెప్టెంబర్‌ 21న వాయుగుండంగా, ఆపై 22న తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబర్‌ 21 నుంచి 23 వరకు రాష్ట్రంలోని పలు జిలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.