Site icon NTV Telugu

Railway Jobs 2025: రైల్వేలో 2,570 JE పోస్టులు.. కొడితే లైఫ్ సెట్ అంతె.. అర్హులు ఎవరంటే?

Trains

Trains

మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. అక్టోబర్‌లో జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులకు 2,570 ఖాళీల కోసం దరఖాస్తులను ప్రారంభించనుంది. ఈ నియామకానికి సంబంధించిన షాట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Also Read:RSS: రేపు ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలు.. ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ..

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 2,570 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైన నోటీసు ప్రకారం, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31న ప్రారంభమై నవంబర్ 30, 2025 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు అధికారిక RRB పోర్టల్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానున్నది.

Also Read:Darshan: ఉగ్రవాదులను ఉంచే సెల్‌లో దర్శన్‌

అభ్యర్థులు ఈ పోస్టుకు సంబంధించిన సాంకేతిక అర్హతను కలిగి ఉండాలి. JE, సంబంధిత పోస్టులకు, దరఖాస్తుదారులు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, IT లేదా సంబంధిత రంగంలో డిప్లొమా లేదా డిగ్రీ (BE/BTech) కలిగి ఉండాలి. CMA పోస్టులకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేపథ్యం ఉన్న గ్రాడ్యుయేట్ అర్హులు. అభ్యర్థుల వయసు 18-33 సంవత్సరాలు (జనవరి 1, 2026 నాటికి) కలిగి ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-I & CBT-II), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతం లభిస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version