NTV Telugu Site icon

Amit Shah: రాయ్‌బ‌రేలిలో రాహుల్‌ గాంధీ ఓటమి ఖాయం..

Amit Sha

Amit Sha

Amit Shah: రాహుల్ గాంధీ వయ‌నాడ్‌తో పాటు రాయ్‌బ‌రేలి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఓటమి భ‌యంతోనే రెండు స్ధాన్నాల్లో బరిలోకి దిగుతున్నాడని కమలం పార్టీ నేతలు మండిపడుతున్నారు. కర్ణాటకలోని చిక్కోడిలో ఇవాళ ( శుక్రవారం) ఎన్నికల ప్రచారానికి హాజ‌రైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అంశంపై స్పందించారు. రాహుల్ బాబాను సోనియా గాంధీ 2-20 సార్లు లాంఛ్ చేసినా ఇప్పటి వ‌ర‌కూ సక్సెస్ కాలేద‌ని ఎద్దేవా చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ అమేథి నుంచి పారిపోయి రాయ్‌బ‌రేలిలో నామినేష‌న్ దాఖ‌లు చేశార‌ని అమిత్ షా పేర్కొన్నారు.

Read Also: Aavesham : ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

కాగా, రాహుల్ గాంధీకి ఈ వేదిక నుంచి తాను ఓ విష‌యం చెప్పాదలుచుకున్నాను.. ఈ ఎన్నిక‌ల్లో రాహుల్ బాబా రాయ్‌బ‌రేలి నుంచి బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ చేతిలో భారీ తేడాతో ఓడిపోతున్నారని ఆయన జోస్యం చెప్పుకొచ్చారు. ఇక, అంత‌కు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా రాయ్‌బ‌రేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడంపై రియాక్ట్ అయ్యారు. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో ఓట‌మి భ‌యంతోనే ఆయన రాయ్‌బ‌రేలి నుంచి కూడా పోటీ చేస్తున్నార‌ని మండిపడ్డారు. కాంగ్రెస్ రాజ్యంగాన్ని మార్చాల‌ని కోరుకుంటోంద‌ి.. ద‌ళితులు, ఓబీసీ కోటాలో ఉన్న రిజర్వేషన్లను తగ్గించి.. వాటిని జిహాది ఓటు బ్యాంక్‌కు పంచాల‌ని కుట్ర చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విప‌క్షాలు ( ఇండియా కూటమి) దేశాన్ని అభివృద్ధి చేయాల‌ని కోరుకోవ‌డం లేదు.. కేవలం ఓట్ల కోసం స‌మాజాన్ని విచ్ఛిన్నం చేయ‌డ‌మే వాటికి తెలిసిన మార్గం అని ప్రధాని మోడీ ఆరోపించారు.