NTV Telugu Site icon

Rahul Gandhi Bike Ride: స్టైలిష్ లుక్‌లో పాంగాంగ్‌ సరస్సుకు రాహుల్ బైక్‌ రైడ్

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi Bike Ride: ఆగస్టు 20న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను జరుపుకోనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్‌పై వెళ్లారు. రాహుల్ గాంధీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పంచుకున్న చిత్రాలలో ఇతర బైక్‌ రైడర్లు రాహుల్‌ను అనుసరిస్తుండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేటీఎం390 అడ్వెంచర్‌ ద్విచక్రవాహనాన్ని నడుపుతున్నాడు. ఈ చిత్రాల్లో రాహుల్‌ గాంధీ హెల్మెట్, గ్లోవ్స్, రైడింగ్ బూట్లు, జాకెట్‌తో సహా పూర్తి బైకింగ్ గేర్‌లో లడఖ్‌లోని సుందరమైన పర్వతాల గుండా తన రైడ్‌ను ఆస్వాదిస్తున్నట్లు కనిపించారు. రైడ్‌ ప్రారంభానికి ముందు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. “ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్‌ సరస్సు ఒకటి అని మా నాన్న (రాజీవ్‌ గాంధీ) చెప్పేవారు.” అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ తమ ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ఈ రాత్రికి పాంగాంగ్‌ సరస్సు వద్ద ఉన్న టూరిస్ట్‌ క్యాంప్‌లో రాహుల్ గాంధీ బస చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

Read Also: Kishan Reddy: జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి ఆగ్రహం

రాహుల్ గాంధీ ప్రస్తుతం లడఖ్ పర్యటనలో ఉన్నారు. ఇది ఆగస్టు 25 వరకు కొనసాగుతుంది. 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్‌ లద్దాఖ్‌కు రావడం ఇదే తొలిసారి. శుక్రవారం ఆయన లేహ్‌లోని యువతతో ముచ్చటించారు. త్వరలో లడఖ్ స్వయం ప్రతిపత్తి అభివృద్ధి మండలికి ఎన్నికలు జరగనున్న వేళ.. రాహుల్ గాంధీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబరు 10న లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌, కార్గిల్‌ ప్రాంతంలో కౌన్సిల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ కలిసి పోటీచేస్తోంది. ఈ క్రమంలో రాహుల్‌ అక్కడ పర్యటించడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగా ఆయన స్థానిక కాంగ్రెస్‌ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

 

 

Show comments