Site icon NTV Telugu

Rahul Gandhi: రాహుల్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఎమర్జెన్సీగా వయనాడ్‌కు పయనం

Rahul

Rahul

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రకు (Bharat Jodo Nyay Yatra) తాత్కాలిక బ్రేక్ పడింది. హుటాహుటిన ఆయన తన సొంత నియోజకవర్గం కేరళలోని వయనాడ్‌కు (Wayanad) బయల్దేరి వెళ్లారు. దీంతో ఆదివారం 3 గంటల వరకు యాత్ర వాయిదా పడింది.

రాహుల్ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో (Varanasi) కొనసాగుతోంది. శుక్రవారమే భారత్ జోడో యాత్ర యూపీలోకి ప్రవేశించింది. ఈనెల 21 వరకు ఉత్తరప్రదేశ్‌లో యాత్ర కొనసాగనుంది. అయితే శనివారం వారణాసిలో యాత్ర కొనసాగుతుండగా.. వయనాడ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. వయనాడ్‌లో ఏనుగు దాడిలో మృతి చెందిన కుటుంబాన్ని రాహుల్ పరామర్శించనున్నారు. ఇందుకోసం రాహుల్ వారణాసి నుంచి వయనాడ్‌కు బయల్దేరి వెళ్తు్న్నారు.

అటవీ శాఖకు చెందిన ఎకో-టూరిజం గైడ్ ఇటీవల ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడు కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ వయనాడ్ వెళ్తు్న్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ ట్విట్టర్‌లో తెలియజేశారు.

రాహుల్ గాంధీ అత్యవసరంగా వయనాడ్‌లో వెళ్తున్నారని.. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారంభమవుతుందని వెల్లడించారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అన్ని రాష్ట్రాల్లో ఉత్సాహంగా సాగుతోంది. కార్యకర్తలను, ప్రజలను కలుసుకుని ఉత్తేజాన్ని నింపుతున్నారు. వచ్చే నెలలో ఈ యాత్ర ముగియనుంది.

 

Exit mobile version