NTV Telugu Site icon

Rahul Gandhi : రెండ్రోజుల పర్యటన నిమిత్తం నేడు కర్ణాటకకు రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు కర్ణాటకకు వెళ్లనున్నారు. అక్కడే రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తారు. రాహుల్ రెండ్రోజుల పర్యటనలో పలు ఆలయాల సందర్శన, ప్రజలతో చర్చలు, బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని కాంగ్రెస్ పార్టీ శనివారం పేర్కొ్ంది. రాహుల్ షెడ్యూల్ ఇలా సాగనుంది.. తొలుత ఆయన ఢిల్లీ నుంచి కర్ణాటకలోని హుబ్లీకి ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో బగల్‌కోటెలోని కూడల సంగమకు వెళ్తారు. లింగాయతుల ప్రధాన దేవస్థానాల్లో కూడల సంగమ ఒకటి.

Read Also : Bhakthi TV : అక్షయ తృతీయ నాడు ఈ స్తోత్రాలు వింటే సకల పాపాలు పటాపంచలై.. సర్వ సంపన్నులవుతారు

కర్ణాటకలో లింగాయతుల ప్రభావం ఎక్కువే అని తెలిసిందే. ఆయన సంగమనాథ టెంపుల్, ఐక్య లింగలో ప్రార్థనలు చేస్తారు. అనంతరం, బసవ జయంతి వేడుకల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం విజయపురలో శివాజీ సర్కిల్ దగ్గర జన సంపర్క కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి రోజైన సోమవారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ చెరుకు రైతులతో చర్చిస్తారు. ముఖ్యంగా బెళగావి రామదుర్గ ఏరియాలోని స్థానికులతో ఆయన ఇంటరాక్ట్ అవుతారు. ఆ తర్వాత గదగ్ వెళ్లి యువ సంవాద్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఆయన హావేరి జిల్లాలో హంగల్‌లో బహిరంగ సభకు హాజరవుతారు. అదే రోజు రాత్రి ఆయన హుబ్బలికి తిరిగి పయనమవుతారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు. కర్ణాటకలో రెండు వారాల వ్యవధిలోనే రాహుల్ గాంధీది ఇది రెండో పర్యటన.

Read Also : HD Kumaraswamy : అనారోగ్యం కారణంగా హాస్సిటల్లో చేరిన మాజీ సీఎం

Show comments