NTV Telugu Site icon

Rahul gandhi: రాయ్‌బరేలీ, వయనాడ్‌పై సాయంత్రం కీలక ప్రకటన

Raeje

Raeje

రాహుల్‌గాంధీ కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. ఈరోజే తన నిర్ణయాన్ని లోక్‌సభ సచివాలయానికి తెలియజేయనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్.. రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. రాయ్‌బరేలీ కంటే ఎక్కువ మెజార్టీ వయనాడ్‌లో సాధించారు. అయితే ఈ రెండింటిలో ఏదో ఒక స్థానాన్ని అయితే వదులుకోవల్సి ఉంటుంది. అది కూడా రోజే లోక్‌సభ సచివాలయాన్ని సమాచారాన్ని అందజేయాలి. ఈ నేపథ్యంలో సాయంత్రం రాహుల్ నుంచి కీలక ప్రకటన రానుంది.

ఇది కూడా చదవండి: Team India Players: బీచ్ లో అర్ధనగ్నంగా వాలీబాల్ ఆడుతూ రెచ్చిపోయిన టీమిండియా ఆటగాళ్లు.. (వీడియో)

ఇదిలా ఉంటే రాహుల్.. వయనాడ్ స్థానాన్ని వదులుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. రాయ్‌బరేలీ అనేది గాంధీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది. ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీ దగ్గర నుంచి రాయ్‌బరేలీ కంచుకోట. ఇదే స్థానంలో రాహుల్ కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రియాంక గాంధీ ఎప్పటినుంచో రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నారు. దీంతో వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకుంటే.. ఆ స్థానం నుంచి ప్రియాంకను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రానికి కాంగ్రెస్ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Student Suicide: మొబైల్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. మెరుగైన స్థానాలు సంపాదించింది. సింగిల్‌గా 99 స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉండేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మరి ఈ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి ఆశిస్తోంది. ఆ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేయాలని భావిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Manipur Violence: మణిపూర్‌లో జరిగిన హింసపై అమిత్ షా సమీక్ష..