NTV Telugu Site icon

Rahul Gandhi: త్వరలో భారత్ జోడో యాత్ర!.. రాహుల్ గాంధీ వీడియో వైరల్

Rahul Gandhi

Rahul Gandhi

జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆగస్టు 29న జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకి సంబంధించిన ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. గత రెండేళ్లలో రాహుల్‌ గాంధీ.. ‘భారత్‌ జోడో యాత్ర’, ‘భారత్ జోడో న్యాయ్‌ యాత్ర’ పేరిట రెండు యాత్రలు చేపట్టిన విషయం తెలిసిందే. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చారు. తాజాగా న్యాయ్‌ యాత్ర సందర్భంగా తమ శిబిరాల వద్ద జరిగిన మార్షల్‌ ఆర్ట్స్‌ సెషన్లకు సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. అలాగే త్వరలో ‘భారత్‌ డోజో యాత్ర’ చేపట్టబోతున్నట్లు వ్యాఖ్యానించారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు. కాగా.. దానికి సంబంధించిన వీడియోలను షేర్ చేశారు.

READ MORE: Physical Harassment: బాలికకు అశ్లీల చిత్రాలు చూపించి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డ స్కూల్ స్పీపర్

వీడియోలో రాహుల్ గాంధీ యుద్ధ కళలను అభ్యసిస్తున్నట్లు కనిపిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో తాను ప్రతిరోజూ జియు-జిట్సును ప్రాక్టీస్ చేసేవాడినని, అందులో తనతో పాటు పలువురు కూడా పాల్గొన్నారని వీడియో క్యాప్షన్‌లో తెలిపారు. వీడియోను పంచుకుంటూ.. రాహుల్ గాంధీ ఇలా వ్రాశారు.. “భారత్ జోడో న్యాయ యాత్రలో, మేము వేలాది కిలోమీటర్లు ప్రయాణించినప్పుడు.. మా క్యాంప్‌సైట్‌లో ప్రతిరోజూ సాయంత్రం జియు-జిట్సును ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఇది ఫిట్‌గా ఉండటానికి చాలా సులభమైన మార్గం. మేము బస చేసిన నగరాల నుంచి తోటి ప్రయాణికులు, యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ఒక చోట చేర్చడం ద్వారా చాలా త్వరగా కమ్యూనిటీ కార్యకలాపంగా మారింది. ఈ యువ మనసులకు ‘జెంటిల్ ఆర్ట్’ అందాన్ని పరిచయం చేయడమే మా లక్ష్యం. ఇది ధ్యానం, జియు-జిట్సు, ఐకిడో విద్యాలు.. అహింసాత్మక సంఘర్షణ పరిష్కార పద్ధతుల కలయిక. వారి హింసను సౌమ్యతగా మార్చడం, మరింత దయగల, సురక్షితమైన సమాజాన్ని సృష్టించడానికి వారికి సాధనాలను అందించడం మా లక్ష్యం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, మీలో కొందరికి ‘జెంటిల్ ఆర్ట్’ సాధనలో స్ఫూర్తిని ఇవ్వాలని ఆశిస్తూ నా అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.” అని పేర్కొన్నారు. దీంతో చివర్లో ఒక లైన్‌లో “ఇండియా డోజో టూర్ త్వరలో వస్తోంది” అని రాశారు.