Rahul Gandhi: నగరంలో గిగ్ వర్కర్లు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రతిపక్ష నేత, సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. రాహుల్ గాంధీ ఓ అమ్మాయి స్కూటీపై ప్రయాణించారు. హైటెక్స్ ముందున్న ఇందిరాగాంధీ విగ్రహం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో తన స్కూటీపై రాహుల్ గాంధీ ప్రయాణించడం పట్ల గిగ్ వర్కర్ లలిత ఫుల్ ఖుషి అయ్యారు. “నేను ఈరోజు గిగ్ వర్కర్స్ ర్యాలీ ఉందని తెలుసుకుని ఇక్కడకు వచ్చా. నేను స్కూటీపై కూర్చున్న సమయంలో ఒకరు వచ్చి రాహుల్ గాంధీ మీ బైక్ ఎక్కుతారు అని చెప్పారు. రాహుల్ గాంధీని నా స్కూటీ మీద ఎక్కించుకుని డ్రైవ్ చేయడం మర్చిపోలేనిది. ఆయన నాతో చాలా బాగా మాట్లాడారు. అమ్మాయిల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి. నేను హాస్టల్‌లో ఉంటూ రాపిడో డ్రైవ్ చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నా. మాది కర్నూలు జిల్లా.. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మహిళలకు ఇంకా భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.” అని లలిత తన అనుభవాలను పంచుకున్నారు. ఇక ఈ ర్యాలీ అనంతరం రాహుల్ గాంధీ జయభేరి గ్రౌండ్‌లోని ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి

Rahul Gandhi Rides Gig Worker Lalitha
