Rahul Gandhi Reveals Dating Story: తన తల్లిదండ్రులు ప్రేమలో పడిన రెస్టారెంట్‌కే గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర విషయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Reveals Dating Story: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. తన తల్లిదండ్రుల ప్రేమకథతో పాటు కాలేజీ రోజుల్లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా తన మాజీ ప్రేయసితో కలిసి వెళ్లిన రెస్టారెంట్ గురించి చెప్పిన విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విషయం ఏంటంటే..? రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారట. ఆ రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటంటే.. అక్కడే తన తల్లిదండ్రులు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ తొలిసారి కలుసుకున్నారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న ‘వర్సిటీ రెస్టారెంట్’లోనే వారిద్దరి పరిచయం ప్రేమగా మారిందని కుటుంబంలో తరచూ చెప్పుకునేవారని ఈ సందర్భంగా రాహుల్ గుర్తుచేసుకున్నారు.
చాలా ఏళ్ల తర్వాత తాను కూడా అదే నగరంలో చదువుకుంటున్న సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను అక్కడికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ఆ రెస్టారెంట్ వెనుక ఉన్న తన తల్లిదండ్రుల ప్రేమకథ గురించి ఆమెకు తెలియదని చెప్పారు. అక్కడికి వెళ్లిన తర్వాత తన తల్లిదండ్రులు ఇదే రెస్టారెంట్లో కలుసుకున్నారని సిబ్బందికి చెప్పగా.. అక్కడున్న వ్యక్తి వారిద్దరూ తనకు తెలుసంటూ బదులిచ్చారని నవ్వుతూ చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ.. అంతేకాకుండా రెస్టారెంట్లో ఏం తినాలో అడిగితే ‘చికెన్ చస్సూర్’ బాగుంటుందని సిబ్బంది సూచించారట. దీంతో ఇద్దరూ అదే ఆర్డర్ చేశారని, అయితే ఆ వంటకం మాత్రం ఏమాత్రం బాగోలేదని రాహుల్ చమత్కరించారు. ప్రేమలో పడాలనుకునేవారు వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లొచ్చని, కానీ అక్కడ మాత్రం చికెన్ చస్సూర్ తినకూడదని సరదాగా వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలతో ఆ కార్యక్రమంలో నవ్వులు విరిశాయి.
Also Read
- Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!
- PM Modi in Philippines: మనీలాలో వందేళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను సందర్శించిన మోడీ.. పునరాభివృద్ధి పనులకు శ్రీకారం
- Badrinath Highway Tragedy: బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి!
- Modi-Trump Meeting in Manila: మోడీతో ట్రంప్ కీలక భేటీ.. మనీలాలో క్వాడ్ సమ్మిట్‌లో ఏం జరగబోతోంది?
ఇక, తన తల్లిదండ్రులకు మాత్రం ఆ రెస్టారెంట్లో భోజనం అద్భుతంగా గుర్తుండిపోయిందని, కానీ తనకు మాత్రం అక్కడి ఆహారం అంతగా నచ్చలేదని రాహుల్ పేర్కొన్నారు. ప్రస్తుతం తన మాజీ ప్రేయసితో ఎలాంటి సంబంధం ఉందని అడిగిన ప్రశ్నకు.. తామిద్దరం ఇప్పుడు స్నేహితులమని సమాధానమిచ్చారు. దీంతో సోనియా, రాజీవ్ ప్రేమకథతో పాటు రాహుల్ కాలేజీ రోజుల జ్ఞాపకాలు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తాజావార్తలు
-
Rahul Gandhi Reveals Dating Story: తన తల్లిదండ్రులు ప్రేమలో పడిన రెస్టారెంట్‌కే గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర విషయాలు!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
IPL 2027 Retention Live: రిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు?.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Vijaya Dairy Board Emergency Meeting: విజయ డైరీలో కీలక పరిణామం.. రేపటికి వాయిదా పడిన బోర్డు అత్యవసర సమావేశం!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
ట్రెండింగ్
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!