NTV Telugu Site icon

Rahul Gandhi: “20-30 ఏళ్లుగా ఓర్చుకున్నా”.. పెళ్లిపై స్పందించిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

Rahul Gandhi

Rahul Gandhi

జమ్మూకశ్మీర్‌లో తన పెళ్లిపై రాయ్‌బరేలీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనని, అయితే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పాడు. 20-30 ఏళ్లుగా పెళ్లి ఒత్తిడి నుంచి బయటకు వచ్చానని కూడా రాహుల్ అన్నారు. గత వారం జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించిన సందర్భంగా కశ్మీరీ యువతులతో రాహుల్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీరీ అమ్మాయిల బృందంతో జరిగిన ఈ సంభాషణ వీడియోను సోమవారం తన యూట్యూబ్ ఛానెల్‌, ఎక్స్ లో అప్‌లోడ్ చేశారు.

READ MORE: Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు-లారీ ఢీ, ఐదుగురు స్పాట్ డెడ్

కాశ్మీర్‌ పర్యటనలో భాగంగా కశ్మీర్ కి చెందిన యువతులతో రాహుల్ ముచ్చటించారు. ఈ సందర్భంగా అమ్మాయిలు పెళ్లి ప్రణాళికల గురించి రాహుల్ ని ప్రశ్నించారు. “నేను పెళ్లికి ప్లాన్ చేయడం లేదు. కానీ అది జరిగితే అది (మంచిది) . 20-30 సంవత్సరాల వివాహ ఒత్తిడి అధిగమించా.” అని పేర్కొన్నారు. తన పెళ్లికి తప్పకుండా ఆహ్వానిస్తానని కశ్మీర్ యువతులకు రాహుల్ హామీ ఇచ్చారు.

READ MORE: ICC Women’s T20 World Cup 2024: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 కొత్త షెడ్యూల్‌ విడుదల..

దీంతో పాటు జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలనే డిమాండ్‌ను ఆయన మరోసారి లేవనెత్తారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఢిల్లీ నుంచి నడిపించడం వల్ల ప్రయోజనం లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి ప్రశ్నించగా.. ‘ఎవరి మాటా వినకపోవడమే ప్రధానమంత్రితో నా సమస్య’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా మాట్లాడారు. భారతీయ చరిత్రలో ఒక రాష్ట్రానికి పూర్తి రాష్ట్ర హోదాను తొలగించడం ఇదే మొదటిసారి అన్నారు. ఈ విధానం తనకు నచ్చలేదన్నారు. కానీ ఇప్పుడు మనం మన హోదాను తిరిగి పొందాలని ముఖ్యమన్నారు.