లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సోమవారం ఖర్దుంగ్లా పాస్‌ను సందర్శించారు. అంతేకాకుండా తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పాంగాంగ్ సరస్సు వద్ద నివాళులర్పించారు. ఖర్దుంగ్లా ప్రాంతానికి రాహుల్ గాంధీ బైక్ పై వెళ్లారు. లేహ్, ష్యోక్, నుబ్రా లోయల నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో పర్వతం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రహదారిగా ఖర్దుంగ్లా కనుమ పేరు పొందింది. మరోవైపు రాహుల్ బైక్‌పై వెళుతున్నప్పుడు అతను కొంతమందిని కలిశాడు. అంతేకాకుండా రాహుల్ ను కలిసిన నెటిజన్లు.. రాహుల్ మంచి స్టైలిష్ లుక్ లో ఉన్నారని, రేసర్ లా ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు. గురువారం లడఖ్ చేరుకున్న రాహుల్ గాంధీ.. ఆగస్టు 25 వరకు అక్కడే ఉండనున్నారు.
Read Also: Snake Gourd: పొట్లకాయ సాగులో అధిక లాభాలకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రాహుల్ గాంధీ బైక్ పై రైడ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైకర్లతో కలిసి ఖర్దుంగ్ లాకు చేరుకుని వారితో ఫోటోలకు పోజులివ్వడం అందులో కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వాటిలో రంగులరాట్నం, లడఖ్‌లోని పర్వత భూభాగంలో డ్రైవింగ్ చేయడం, అంతేకాకుండా కొంతమంది గిటారిస్టులను ప్రోత్సహిస్తూ స్థానికులతో మాట్లాడం లాంటివి ఉన్నాయి.
Read Also: MLA Madan Reddy : కేసీఆర్ బావిలో దూకమంటే దూకుతా.. నాకు అన్యాయం చేయడు
2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లడఖ్ లో రాహుల్ గాంధీ పర్యటించడం ఇదే తొలిసారి. మరోవైపు ఆగస్టు 25న లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌ఎహెచ్‌డిసి)-కార్గిల్ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోడీ మాత్రం చైనా ఆక్రమణపై పెదవు విప్పరని విమర్శించారు.
