NTV Telugu Site icon

Rahul Gandhi: దేశమంతా రైతు రుణమాఫీ, ఒకటే జీఎస్టీ

Rahul 1 (1)

Rahul 1 (1)

రాహుల్ భారత్ జోడో యాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. ప్రస్తుతం తెలంగాణలో రాహుల్ యాత్ర సాగుతోంది. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగుతుంది.. తెలంగాణ ప్రజలతో మాట్లాడుతూ అందరి హృదయాల్లో బాధలు తెలుసుకుంటున్నా అన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విధ్వంసం సృష్టిస్తోంది. అన్నదమ్ముల మధ్య గొడవలు పెడుతున్నారు.. బీజేపీకీ టీఆర్ఎస్ మద్దతు పలుకుతుంది..ఉభయ సభల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతుగా ఉందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

తెలంగాణ తల్లులు..సోదరులతో మాట్లాడుతూ అందరి హృదయాల్లో బాధలు తెలుసుకుంటున్నా అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ ఎస్ లపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తెలంగాణ లో సీఎం లేడు.. ఇక్కడ రాజు ఉన్నాడు.. ఆయనకి ఒకటే టార్గెట్. ప్రజల దగ్గర ఉన్న భూములు…డబ్బులు ఎలా లాక్కోవాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. సీఎం రోజు సాయంత్రం ధరణి పోర్టల్ చూస్తున్నారు. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి.. ఎవరి భూములు లాక్కోవాలి అని చూస్తారు. అటవీ హక్కుల చట్టం తో గిరిజనులకు మేము భూములు ఇచ్చాం అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల భూములు లాక్కుంటుందన్నారు రాహుల్.

Read Also: Hyderabad to Thailand: హైదరాబాద్-థాయ్‌లాండ్ మధ్య విమాన సర్వీసులు

వ్యవసాయం చేసుకునే హక్కు కూడా లేకుండా చేస్తుంది. తెలంగాణలో ఇవాళ భూమి అనేది ముఖ్యమైన అంశంగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అటవీ హక్కుల చట్టం పూర్తిగా అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. దళితుల భూములకు వారికి పూర్తి హక్కులు ఇస్తాం. చేనేత కార్మికులు ఇవాళ కలిశారు.. జీఎస్టీతో నష్టపోతున్నాం అని బాధపడ్డారు. దీంతో చిరు వ్యాపారులు సంక్షోభంలో పడ్డారు. నోట్ల రద్దు. జీఎస్టీ ధనికుల కోసం తెచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. జీఎస్టీలో మార్పులు చేస్తాం అన్నారు. దేశ వ్యాప్తంగా ఒకటే జీఎస్టీ అమలుచేస్తాం అన్నారు. దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ మళ్ళీ చేస్తాం. యాత్ర పట్ల మీ ప్రేమ ..ఆశీర్వాదం ఉంది. ఈయాత్రలో ఎవరైనా కింద పడితే అందరూ వచ్చి లేపుతున్నారు. అదే దేశ ప్రజల స్ఫూర్తి అని ఆనందం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.

Read Also: Rahul Gandhi complaint to Elon Musk : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‎కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫిర్యాదు

Show comments