NTV Telugu Site icon

Jharkhand: రాహుల్‌తో కల్పనా సోరెన్ భేటీ.. ఏం చర్చించారంటే..!

Rahul Kalpana

Rahul Kalpana

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. సోమవారం రాహుల్ పర్యటన ప్రారంభానికి ముందు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్.. రాహుల్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విధానంపై ఇరువురు చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రాష్ట్ర అసెంబ్లీలో చంపయ్ సోరెన్‌ ప్రభుత్వానికి బలపరీక్ష జరిగింది. ఈ పరీక్షలో చంపయ్ విజయం సాధించారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి చెందిన 47 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. వ్యతిరేకంగా 27 ఓట్లు పడ్డాయి. దీంతో చంపయ్ సోరెన్ ప్రభుత్వం సునాయాసంగా గట్టెక్కేసింది. అంతక ముందు కూటమికి చెందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లో ఓ క్యాంప్‌లో ఉంచారు. మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఫ్లో్ర్ టెస్ట్‌లో పాల్గొనేందుకు కోర్టు అనుమతించింది. దీంతో ఆయన అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీకి హేమంత్ సోరెన్ సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణలను బీజేపీ నిరూపించాలని కోరారు. ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని తెలిపారు. తన అరెస్ట్ విషయంలో కేంద్రం కుట్రపన్నిందని.. ఈ విషయంలో రాజ్‌భవన్ కీలక పాత్ర పోషించిందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి:Arvind Kejriwal: ఇలాంటి డ్రామాలతో దేశం అభివృద్ధి చెందదు.. ఢిల్లీ క్రైం బ్రాంచ్ నోటీసుపై విసుర్లు..