Site icon NTV Telugu

Rahul Gandhi: రాయ్‌బరేలీలో రాహుల్ నామినేషన్.. వెంట సోనియా, ప్రియాంక

E

E

ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాహుల్ వెంట సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, తదితరులు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ బరిలోకి దిగారు.

ఇది కూడా చదవండి:Komatireddy Venkat Reddy: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ శకం ముగుస్తుంది..

రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కుంచుకోటలాంటిది. ఇక్కడ నుంచి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానంలో రాహుల్ రంగంలోకి దిగారు. వాస్తవానికి ఈ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. చివరికి రాహుల్ బరిలోకి దిగారు.

ఇది కూడా చదవండి: Peddireddy vs Nallari: మరోసారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పెద్దిరెడ్డి హాట్‌ కామెంట్లు..

ఇక అమేథీ నుంచి కిశోరీ లాల్‌ శర్మ నామినేషన్ సమర్పించారు. ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో భాగంగా మే 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు సమర్పించేందుకు శుక్రవారమే ఆఖరితేదీ. ఈ స్థానాల్లో చివరి వరకూ సస్పెన్స్‌ కొనసాగించిన కాంగ్రెస్‌.. ఈ ఉదయమే అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఈసారి రాహుల్‌ అమేథీని వదిలి రాయ్‌బరేలీకి మారడంపై బీజేపీ నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి. అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

 

Exit mobile version