Site icon NTV Telugu

Rahul Gandhi: ఈసీకి బీజేపీతో పొత్తు ఉంది.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

02

02

Rahul Gandhi: బీహార్‌లో SIR కి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర ఆదివారం 8వ రోజు చేరుకుంది. ఈసందర్భంగా పూర్ణియాలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్‌, ముఖేష్ సాహ్ని, CPI(ML) నాయకుడు దీపాంకర్ భట్టాచార్య, పప్పు యాదవ్ తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు.

READ ALSO: AP Tourism: పర్యాటక రంగానికి బంగారు భవిష్యత్తు.. 2026లో జరిగే 41వ ఐఏటీఓ సదస్సుకు విశాఖపట్నం అతిథ్యం..

ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పలేదు..
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈసీకి బీజేపీతో పొత్తు ఉందని అన్నారు. ఇప్పటివరకు తన ప్రశ్నలకు ఈసీ ఎలాంటి సమాధానాలు చెప్పలేదన్నారు. కర్ణాటకలో కొత్తగా లక్ష మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని అడిగిన ప్రశ్నకు ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం రాలేదని విమర్శించారు. బీజేపీ నాయకుడు అనురాగ్ ఠాకూర్ నకిలీ ఓటర్లను చేర్చారని మాట్లాడితే ఆయన నుంచి ఎటువంటి అఫిడవిట్ అడగలేదని, కానీ తన నుంచి మాత్రం అఫిడవిట్ అడిగారని ఈసీపై ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల కమిషన్ ఎవరి వైపు ఉందో మీడియాకు కూడా తెలుసని చెప్పారు. తమ యాత్ర కారణంగా బీహార్‌లో ప్రతిఒక్కరూ రాజకీయంగా చురుకుగా మారారని అన్నారు.

బీహార్‌లో ఓట్ల చోరీ జరగనివ్వం..
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీహార్‌లో తమ యాత్ర చాలా విజయవంతమైంది, ప్రజలు స్వయంగా యాత్రలో పాల్గొనడానికి వస్తున్నారని అన్నారు. దీంతో ఓట్ల దొంగతనం గురించి మేము చెప్తున్న విషయాలు బీహార్‌లోని కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపుతున్నాయని అర్థం అవుతుందన్నారు. ఎన్నికల కమిషన్ పని సరైన ఓటర్ల జాబితాను అందించడమని, కానీ వారు మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో అలా చేయలేదని మండిపడ్డారు. బీహార్‌లో ఓట్లను దొంగిలించడానికి తాము అనుమతించమని స్పష్టం చేశారు. వాళ్లు మహారాష్ట్రలో, హర్యానాలో, కర్ణాటకలో ఓట్లు దొంగిలించారని తాము స్పష్టంగా చూపించామని, కానీ ఇక్కడ మాత్రం అది జరగనివ్వమని అన్నారు.

బీజేపీ పార్టీ సెల్‌గా ఈసీ..
ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీ సెల్‌గా, ఆ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తోందని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ విమర్శులు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును, ప్రజల ఉనికిని కాపాడటానికి, రాహుల్ గాంధీతో కలిసి మనమందరం ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని అన్నారు. ఈ ప్రయాణంలో ఒక విషయం స్పష్టంగా తెలుస్తుందని.. ఇక్కడ మాత్రం ఓట్లు చోరీ జరగనివ్వమని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు.

READ ALSO: Missing Plane Mystery: జాడలేని విమానం .. 22 రోజులుగా మిస్సింగ్..

Exit mobile version