కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాందీ ప్రధాని మోడీ పై సంచలన కామెంట్స్ చేశారు. వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ రెండు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో ఓడేవారని రాహుల్ జోస్యం చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో కాంగ్రెస్ నేతలతో సమావేశం అయిన రాహుల్ గాంధీ తాను అహంకారంతో మాట్లాడడం లేదని, మోడీ పాలనతో వారణాసి ప్రజలు విసిగిపోయారని అన్నారు..ఈ సమావేశంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, అమేథి, రాయ్‌బరేలీలలో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం సాధించిందని, దేశమంతా అయోధ్య వైపు చూస్తోందని, స్వచ్ఛమైన రాజకీయాలు అవసరమని అన్నారు.