NTV Telugu Site icon

Rahul Gandhi: రాజస్థాన్ ఎన్నికల ప్రచారానికి దూరంగా రాహుల్ గాంధీ..?

Rahul Gandhi

Rahul Gandhi

రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో బీజేపీ దూకుడుగా ప్రచారం చేస్తోంది. ఇక, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇప్పటికే ప్రధాని మోడీ ప్రచార బాధ్యతలు చేపట్టారు. అయితే కాంగ్రెస్ పక్షాన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అయితే, ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ప్రచారానికి రాలేదు. దీంతో రాజకీయ నిపుణులు దానిపై భిన్నమైన రాజకీయ అర్థాలను తెలియజేస్తున్నారు. అయితే, ప్రియాంక గాంధీ రెండు ర్యాలీలు నిర్వహించారు. ఖర్గే కూడా రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు. కానీ రాహుల్ గాంధీ ఒక్క బహిరంగ సభలో కూడా పాల్గొనలేదు. దీపావళి తర్వాత రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీల ర్యాలీలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Read Also: Pakistan Semi Final: పాకిస్తాన్ సెమీ ఫైనల్‌లో ఆడుతుంది.. ప్రణాళికలు సిద్ధం చేసిన బాబర్ ఆజామ్‌!

అయితే, ఎన్నికల ప్రకటనకు ముందు రాహుల్ గాంధీ చివరిసారిగా రాజస్థాన్‌లో కనిపించారు. సెప్టెంబర్ 23న జైపూర్‌లో జరిగిన కార్యకర్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. అంతకుముందు ఆగస్టు 9వ తేదీన బన్స్వారా జిల్లాలోని మాన్‌గర్ ధామ్‌కు ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చారు. ఇక, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల ఎన్నికలను ‘సెమీ ఫైనల్స్’గా కాంగ్రెస్- బీజేపీ పార్టీలు చూస్తున్నాయి. మిజోరంలో ఓటింగ్ జరగ్గా, ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఓటింగ్ జరగాల్సి ఉంది. ఇది కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణల్లో ఇంకా ఓటింగ్ జరగాల్సి ఉంది.

Read Also: Traffic: ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్..

ఇక, ఎన్నికలు ప్రకటించి చాలా రోజులైంది కానీ అప్పటి నుంచి రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో ఓటింగ్ జరుగనుంది. అంటే ఓటర్లను ప్రలోభపెట్టడానికి అన్ని పార్టీలకు ఇప్పుడు కేవలం 15 రోజుల సమయం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రాహుల్ గాంధీ పేరు మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ మొదటి స్థానంలో ఉన్నారు. రాజస్థాన్‌కు రాహుల్ గాంధీ దూరం కావడం కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసగా మారింది. అయితే దీపావళి తర్వాత రాష్ట్రంలో పలు ర్యాలీలు నిర్వహించేందుకు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వస్తున్నారని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు.

Read Also: CM YS Jagna Vijayawada Tour: కాసేపట్లో విజయవాడకు సీఎం జగన్‌

రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాల్లో అక్టోబర్ 9న ఎన్నికల తేదీలను ప్రకటించారు. కాగా, మిజోరంలో రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో సైతం ఆయన ర్యాలీలు, రోడ్ షోలు హోరెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ దృష్టి ఎక్కువగా మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాంపై పడింది. అయితే, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ మెరుగైన స్థితిలోనే ఉందని చెబుతున్నారు. తెలంగాణలో గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అందుకే రాహుల్ గాంధీ రాజస్థాన్ వైపు పెద్దగా దృష్టి పెట్టడం లేదు.. సీఎం అశోక్ గెహ్లాట్ పథకాలను రాహుల్ గాంధీ ప్రశంసించారు. అయితే ఎన్నికల ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటున్నారు.