NTV Telugu Site icon

Rahul gandhi: రాహుల్‌గాంధీకి ప్రమోషన్.. ప్రతిపక్ష నేతగా నియామకం

India

India

లోక్‌సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి ప్రమోషన్ లభించింది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియమితులయ్యారు. ఈ మేరకు ఇండియా కూటమి ఎన్నుకున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో సాయంత్రం ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్‌ను ఎన్నుకున్నారు. కూటమిలో ఉన్న వారంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వేణుగోపాల్ పేర్కొ్న్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి 233 సీట్లు సాధించింది. ఇక కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.

మంగళవారం రాయ్‌బరేలీ ఎంపీగా పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రమాణం చేశారు. ఒక చేత్తో రాజ్యాంగం ప్రతిని పట్టుకుని ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం జై రాజ్యాంగం అంటూ నినాదం చేశారు. ఇండియా కూటమి సభ్యులంతా ఇదే మాదిరిగా చేశారు.