Site icon NTV Telugu

Rahul Gandhi: ప్రశ్నించిన వారిపై దాడులు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Rahul

Rahul

Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ బ్రిట‌న్ వేదిక‌గా మ‌రోసారి బీజేపీ, మోదీ స‌ర్కార్‌ పై మండిపడ్డారు. భార‌త్ లో కొత్త సిద్ధాంతం అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు. కేంబ్రిడ్జి వ‌ర్సిటీ ప్రసంగంలో మోదీ స‌ర్కార్‌పై విరుచుకుప‌డిన రాహుల్ తాజాగా లండ‌న్‌లో భార‌త జ‌ర్నలిస్ట్స్ అసోసియేష‌న్ (ఐజేఏ) ప్రతినిధుల‌తో ముచ్చటిస్తూ మ‌రోసారి ప‌దునైన విమర్శలు గుప్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, వారిపై దాడులు చేస్తున్నారన్నారు రాహుల్ గాంధీ.

Read Also: Stray Dogs: అసోంలో కుక్కలకు మంచి డిమాండ్.. రేటు తెలిస్తే షాక్ అవుతారు

తొమ్మిదేండ్లుగా మోదీ ప్రభుత్వ విధానాల‌తో ఏకీభ‌వించ‌ని జ‌ర్నలిస్టుల‌పై దాడులు, అణిచివేత పెచ్చుమీరింద‌ని రాహుల్ ఆందోళ‌న వ్యక్తం చేశారు. బీబీసీ కార్యాల‌యాల‌పై ఇటీవ‌ల జ‌రిగిన ప‌న్ను అధికారుల సోదాల‌ను ప్రస్తావిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ లోని దళితులు, బలహీన సామాజిక వర్గాల ప్రజలు నోరెత్తకూడదని బీజేపీ భావిస్తోందని, దేశ సంపదనంతా నలుగురైదుగురికి పంచాలని ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Read Also: Delhi Court: మోదీని చంపుతాడని సాక్ష్యం ఉందా.. లేదు కదా.. అందుకే నిర్దోషి

Exit mobile version