Site icon NTV Telugu

Rahul Gandhi : తెలంగాణలో 5వ రోజు ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర.. చిన్నారులతో పరుగు లంకించిన రాహుల్‌

Rahul Gandhi

Rahul Gandhi

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో రాహుల్‌ గాంధీతో ప్రముఖులు, ప్రజలు నడుస్తున్నారు. అంతేకాకుండా.. ఈ పాదయాత్రలో తెలంగాణ కాంగ్రెస్‌ వివిధ కళాకారులతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తన పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ విద్యార్థులు, రైతులు, మేధావులు, ప్రొఫెసర్లతో చర్చిస్తున్నారు. పాదయాత్ర తమలో నూతనోత్సాహాన్ని నింపిందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. అయితే.. నిన్న రాత్రి జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో బస చేసి రాహుల్‌ ఈ రోజు ఉదయం అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. ఈ రోజు రాహుల్‌ గాంధీ పాదయాత్రలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జానారెడ్డి పాల్గొన్నారు.

Also Read : Amitabh Wife Shocking Comments: పెళ్లి కాకుండానే పిల్లలను కనొచ్చు.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమితాబ్ వైఫ్

ఉదయం 11 గంటలకు బాలానగర్ జంక్షన్ వద్దకు రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేరుకుంటుంది. ఈ రోజు రచయిత ఇండస్ మార్టెన్ బృందంతో రాష్ట్రంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాహుల్ చర్చించనున్నారు. అనంతరం ఉపాధి హామీ రైతు కూలీలతో సమావేశమై వారి సమస్యల గురించి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత భోజనం విరామం.. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు రాహుల్ పాదయాత్ర పున:ప్రారంభమవనుంది. అయితే.. పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికీ చిన్నారులతో కలిసి రాహుల్‌ గాంధీ పరుగు లంకించారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది.

Exit mobile version