Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..
- రాహుల్ ద్రావిడ్ కు బీసీసీఐ ప్రతిష్టాత్మక సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం
- భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు ఈ ఏడాది సంవత్సరపు ఉత్తమ క్రికెటర్ పురస్కారం
- యువ క్రికెటర్ ఆయుష్ మాత్రే కు దేశీయ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉత్తమ ఆల్‌రౌండర్‌గా లాలా అమర్నాథ్ పురస్కారం
- మిథాలీ రాజ్ కు కూడా జీవిత సాఫల్య తరహా పురస్కారం
- దేశీయ క్రికెట్లో ఉత్తమ సంఘంగా ముంబై క్రికెట్ సంఘం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lifetime Achievement Award: భారత మాజీ క్రికెటర్, మాజీ టీమిండియా కోచ్, లెజండరీ ఆటగాళ్లలో ఒక్కరైనా రాహుల్ ద్రావిడ్ కు బీసీసీఐ వార్షిక నమన్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మకమైన కోల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 15న ఢిల్లీలో జరగనుంది. ఇదే కార్యక్రమంలో భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ Shubman Gill (శుభ్‌మన్ గిల్ కు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇవ్వనున్నారు.
అందిన నివేదిక ప్రకారం.. ముంబైకి చెందిన యువ క్రికెటర్ ‘ఆయుష్ మాత్రే’కు దేశీయ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉత్తమ ఆల్‌రౌండర్‌గా ‘లాలా అమర్నాథ్’ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఇటీవల ఐసీసీ నిర్వహించిన అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో జింబాబ్వే & నమీబియాలో జరిగిన టోర్నీలో భారత్ అండర్-19 జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.
Also Read
మరోవైపు.. భారత మాజీ మహిళా జట్టు కెప్టెన్ “మిథాలీ రాజ్” కు కూడా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ తరహా అవార్డు ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే దేశీయ క్రికెట్లో ఉత్తమ క్రికెట్ అసోసియేషన్‌గా “ముంబై క్రికెట్ అసోసియేషన్” ను సత్కరించనున్నారు.
రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్‌కు చేసిన సేవల కారణంగా ఈ అత్యున్నత అవార్డుకు అర్హుడిగా నిలిచారు. 2012లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా, భారత అండర్-19 జట్టు కోచ్ గా, తర్వాత భారత సీనియర్ జట్టు హెడ్ కోచ్ గా సేవలందించారు. బ్యాటింగ్‌లో భారత్ కు “ది వాల్” గా నిలిచారు. టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ద్రవిడ్.. టెస్ట్ మ్యాచ్‌లలో 13,288 పరుగులు, వన్డేల్లో 10,889 పరుగులు సాధించారు. రిటైర్మెంట్ తర్వాత కొంతకాలం కామెంటేటర్‌గా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత కోచింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన కోచ్ గా ఉన్న సమయంలో భారత్ ఐసీసీ టోర్నీల్లో మంచి ప్రదర్శన చేసింది. ప్రపంచకప్ ఫైనల్ కు చేరడమే కాకుండా.. 2024లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ను కూడా గెలుచుకుంది.
Fuel Update : 40 దేశాల నుంచి భారత్ కు క్రూడాయిల్ వస్తోంది..!
ఇక శుభ్‌మన్ గిల్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ పై జరిగిన టెస్ట్ సిరీస్‌లో తొలి సారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టును అద్భుతంగా నడిపించాడు. ఆ సిరీస్ లో 700కు పైగా పరుగులు సాధించి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. దీంతో అతడికి ఈ ఏడాది ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కనుంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!