NTV Telugu Site icon

IPL Auction 2025: వైభవ్ సూర్యవంశీని అందుకే తీసుకున్నాం: రాహుల్ ద్రవిడ్

Dravid

Dravid

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు. రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన వైభవ్ కోసం.. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ పోటీ పడ్డాయి. చివరకు ఆర్ఆర్ ఇతన్ని సొంతం చేసుకుంది. 13 ఏళ్ల వైభవ్ సూర్య వంశీని తమ జట్టులోకి తీసుకోవడానికి గల కారణాన్ని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ట్రయల్స్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబర్చాడని చెప్పాడు. ‘సూర్యవంశీలో మంచి నైపుణ్యాలు ఉన్నాయి. అతను క్రికెటర్‌గా ఎదిగేందుకు మా జట్టే మంచి వాతావరణమని మేం భావించాం. వైభవ్ మా ట్రయల్స్‌కు హాజరయ్యాడు. అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతని ఆటకు మేం ఫిదా అయ్యాం.’అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Operation Rope: ట్రాఫిక్‌కు చెక్ పెట్టేలా ‘ఆపరేషన్ రోప్‌ వే’.. యాక్షన్‌లోకి పోలీసులు

సూర్యవంశీ ఇటీవల చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో భారత్ అండర్-19 జట్టు తరఫున యూత్ టెస్ట్‌లో సెంచరీ సాధించి.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో సూర్యవంశీ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్యవంశీ.. శనివారం బీహార్ తరపున తన టీ20 అరంగేట్రం చేశాడు. ఆరు బంతుల్లో 13 పరుగులు చేశాడు. జూనియర్ సర్క్యూట్‌లో వార్తల్లో నిలిచిన సూర్యవంశీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేదు. ఐదు మ్యాచ్‌ల్లో 10 సగటుతో పరుగులు సాధించాడు. అధికారిక రికార్డుల ప్రకారం.. అతను 12 సంవత్సరాల 284 రోజుల వయస్సులో ఉన్నప్పుడు 24 రంజీ ట్రోఫీ సీజన్‌లో అరంగేట్రం చేశాడు. తద్వారా టోర్నమెంట్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 12 ఏళ్ల వయస్సులో సూర్యవంశీ బీహార్ తరపున వినూ మన్కడ్ ట్రోఫీ ఆడాడు. ఆడిన ఐదు మ్యాచ్‌లలో దాదాపు 400 పరుగులు చేశాడు.

Ola Electric: ఓలా నుంచి గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్లు విడుదల.. వీటిల్లో స్పెషల్ ఏంటంటే..?