టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం కురింపించాడు. ఈ కీలక మ్యాచ్ లో ద్రివిడ్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా ద్రవిడ్ అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ కోచ్ గా మాత్రం సున్నా అని ఆయన అన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ప్రదర్శన చూసిన బాసిత్ అలీ ఈ విమర్శలు గుప్పించాడు.
Read Also : Harish Rao: పుట్టుక నుండి చావు దాకా.. ప్రజలకు ఏం కావాలో ఆలోచించేది కేసీఆర్ మాత్రమే
టీమిండియా ఎప్పుడైతే తొలుత బౌలింగ్ ఎంచుకుందో అప్పుడే ఈ మ్యాచ్ ను చేజార్చుకుంది. ఇక టీమిండియా బౌలింగ్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లాగే ఉంది. తొలి రోజు లంచ్ సమయానికి.. భారత బౌలర్లు ఏకంగా మ్యాచ్ గెలిచినట్లు చాలా సంతోషంగా కనిపించారు.. ఇప్పుడు టీమిండియా ముందు ఒక్కటే మార్గుం ఉంది.. అది ఆస్ట్రేలియా జట్టును వీలైనంత తొందరగా ఔట్ చేసి.. భారత్ బ్యాటింగ్ కు వచ్చి అద్భుతాలు సృష్టించాలని ఆయన హితవు పలికాడు.
Read Also : Ashok Gehlot: వారికి రెచ్చగొట్టడమే తెలుసు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయం
అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా భారత ఆటగాళ్లు అంత ఫిట్‌నెస్‌గా కనిపించలేదు అని బాలిత్ అలీ అన్నాడు. రహానే, కోహ్లీ, జడేజా మినహా చాలా మంది ప్లేయర్లు బాగా అలసిపోయినట్లు కనిపించారు. ఇక ద్రవిడ్ గురించి మాట్లాడుతూ.. నేను రాహల్ ద్రవిడ్‌కు వీరాభిమానిని..గతంలో ఇదే విషయం చాలా సార్లు చెప్పాను..అతడొక క్లాస్ ప్లేయర్, లెజెండ్. కానీ కోచ్‌గా మాత్రం అతడు పనికి రాడు అంటూ కామెంట్స్ చేశాడు. భారత్‌లో టర్నింగ్ పిచ్ లు తయారు చేయించారు. నాకు ఒక్కదానికి సమాధానం చెప్పండి.. మీరు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ అలాంటి పిచ్ లే ఉన్నాయా? అక్కడ బౌన్సీ పిచ్ లు ఉన్నాయా? ద్రవిడ్ ఏమీ ఆలోచిస్తున్నాడో ఆ దేవుడుకే తెలియాలంటూ విమర్శలు చేశాడు.