Site icon NTV Telugu

Ragi Omelette Recipe: ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్.. హై-ప్రోటీన్ ‘రాగి ఆమ్లెట్’!

Ragi Omelette

Ragi Omelette

Ragi Omelette Recipe: బరువు తగ్గాలనుకునే వారికి అలాగే పోషకమైన బ్రేక్‌ఫాస్ట్ కోరుకునే వారికి ఓ బెస్ట్ ఛాయస్ గా ‘రాగి ఆమ్లెట్’ (Ragi Omelette) నిలుస్తుంది. ఉత్తమ ఎంపిక. ఆరోగ్యకరమైన, ప్రోటీన్ అధికంగా ఉండే ‘రాగి ఆమ్లెట్’ (Ragi Omelette) తాయారు చేయడం చాలా సులభం. రాగులు (Finger Millets) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణ ఆమ్లెట్‌కు రాగి పిండిని జోడించడం ద్వారా దీని రుచి, పోషక విలువలు రెట్టింపు అవుతాయి. కాబట్టి కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం.

Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి, ఎముకల బలానికి బెస్ట్ ఛాయిస్ హెల్తీ ‘రాగి స్మూతీ’!

కావలసిన పదార్థాలు:
* గుడ్లు: 2
* రాగి పిండి: 2 టేబుల్ స్పూన్లు
* ఉల్లిపాయలు – 1
* నల్ల మిరియాల పొడి (Pepper) – తగినంత
* ఉప్పు – రుచికి తగ్గట్టు
* కారం – అర టీ స్పూన్
* మసాలా పొడి (చిటికెడు)
* తరిగిన కొత్తిమీర
* నూనె – 3 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం:
మొదట ఒక బౌల్‌లో రెండు గుడ్లను పగలగొట్టి వేయండి. ఇప్పుడు పగులగొట్టిన గుడ్లలో రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేయండి. ఆ తర్వాత తరిగిన పెప్పర్, ఉల్లిపాయ ముక్కలను కలపండి. ఇంకా అందులోనే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కారం కలపండి. చివరగా కొద్దిగా మసాలా పొడి, తరిగిన కొత్తిమీర వేసి, మిశ్రమం అంతా బాగా కలిసేలా గరిటెతో బాగా కలపండి. అంతే రాగి ఆమ్లెట్ మిశ్రమం రెడీ.

Royal Enfield Electric Bike: రాయల్ ఎన్ఫీల్డ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. రెట్రో-ఫ్యూచరిస్టిక్ లుక్‌తో

ఇక అంతే.. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వేయండి. పాన్ వేడెక్కిన తర్వాత సిద్ధం చేసుకున్న రాగి ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసి రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకోండి. ఇంకేముంది రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి ఆమ్లెట్ సిద్ధం. దీనిని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

Exit mobile version