NTV Telugu Site icon

Raghuveera Reddy: రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది.. ఇలా చేస్తే తెలంగాణలో అధికారం పక్కా..!

Raghuveera Reddy

Raghuveera Reddy

Raghuveera Reddy: తెలంగాణలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది.. బలపడుతోంది.. అధికారంలోకి రావడం గ్యారంటీ అంటున్నారు సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి.. శ్రీసత్యసాయి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తెలంగాణలో పెరుగుతుంది. కర్ణాటక మాదిరి తెలంగాణాలో ఆరు గ్యారంటీల కార్డులను ఇంటింటికి తీసుకెళ్తే.. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు అన్నారు.

Read Also: Kodali Nani: అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క మొరగదు.. కొడాలి నాని సెటైర్లు

ప్రధాని నరేంద్ర మోడీ వంద సార్లు పర్యటించినా.. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ప్రజల్లో కాంగ్రెస్ రావాలని బలంగా ఉందన్నారు రఘువీరారెడ్డి.. ఇక, ఏపీ రాజకీయాలపై ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీ, వైసీపీ దాగుడు మూతలతో పోలవరం ఆలస్యమవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. 2019 నాటికే పోలవరం పూర్తి అయ్యేదన్నారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఈ దేశానికి అవసరం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అవలంభించబోయే వ్యూహా‌లను ఈ నెల 9న జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి. కాగా, తెలంగాణలో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం నేపథ్యంలో… రాష్ట్రంలోని ప్రధాన పార్టీలో ఎన్నికల వ్యూహాలపై నిమగ్నమై ఉన్నాయి.. పనిలో పనిగా.. పార్టీల్లో చేరేవారు.. వెళ్లిపోయేవారు.. ఇలా జంపింగ్ లు కొనసాగుతూనే ఉన్నాయి.