Site icon NTV Telugu

Raghav Chadha: ఉద్యోగం లేదా బిడ్డ..? పరిస్థితి తండ్రికి రాకూడదు.. ఆ సెలవులను చట్టబద్ధం చేయండి..!

Raghav Chadha (1)

Raghav Chadha (1)

Raghav Chadha: రాజ్యసభ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా మరో సామాజిక అంశాన్ని లేవనెత్తారు. ఈసారి ఆయన దేశంలో ‘పితృత్వ సెలవుల’ను (Paternity Leave) ఒక చట్టబద్ధమైన హక్కుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. బిడ్డ పుట్టినప్పుడు కేవలం తల్లికే కాకుండా, తండ్రికి కూడా తగినన్ని సెలవులు ఇచ్చేలా చట్టాల్లో మార్పులు రావాలని ఆయన కోరారు.

Jadeja Kisses CSK Logo: ఇది కదా కావాల్సింది.. CSK లోగోను ముద్దాడిన జడేజా..!

ఆయన ఈ విషయమై మాట్లాడుతూ.. బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులిద్దరినీ అభినందిస్తాం. కానీ, ఆ బిడ్డను చూసుకునే బాధ్యత మాత్రం ఒక్క తల్లిపైనే పడుతోంది. ఇది సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి శారీరక విశ్రాంతితో పాటు భర్త మద్దతు ఎంతో అవసరమని, ఆ సమయంలో భర్త తన భార్యకు, బిడ్డకు అండగా ఉండటం ఒక బాధ్యత అని స్పష్టం చేశారు. ఒక తండ్రి తన ఉద్యోగాన్ని లేదా బిడ్డ సంరక్షణను ఎంచుకోవాల్సిన పరిస్థితి రాకూడదని ఈ సందర్బంగా అసలు విషయాన్నీ లేవనెత్తారు.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రైవేట్ రంగంలో పితృత్వ సెలవులపై స్పష్టమైన చట్టం లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. పిల్లల పెంపకం అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు, అది దంపతులిద్దరి ఉమ్మడి బాధ్యత. మన దేశ చట్టాలు కూడా ఈ వాస్తవాన్ని ప్రతిబింబించాలని చద్దా అన్నారు. తండ్రికి సెలవులు ఇవ్వడం వల్ల కుటుంబ బంధాలు బలపడటమే కాకుండా, సమాజంలో లింగ సమానత్వం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Raghav Chadha: గ్రాముల్లో ఛార్జీలు వసూలు చేసేవారు.. గంటల ఆలస్యానికి పరిహారం ఇవ్వరా..? విమాన సంస్థల తీరుపై ఫైర్..!

రాఘవ్ చద్దా తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. తల్లి కోలుకోవడానికి భర్త తోడు అవసరం, అందుకే పితృత్వ సెలవులను చట్టబద్ధం చేయాలని నేను పార్లమెంట్‌లో కోరాను అని రాసుకొచ్చారు. ఈ డిమాండ్‌ కు సోషల్ మీడియాలో పెద్దెత్తున విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుత సమాజంలో ఇటువంటి సంస్కరణలు ఎంతో అవసరమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version