NTV Telugu Site icon

Andhra University: అమ్మాయిలను డ్యాన్సులు చేయాలంటూ ర్యాగింగ్.. 10 మంది సీనియర్ల సస్పెన్షన్

Andhra University

Andhra University

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మూడురోజుల క్రితం వెలుగుచూసిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్టీవీలో ప్రసారం అయిన కథనాలకు అధికారులు స్పందించి ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్ధినులు పది మందిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థినులను సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ హాస్టల్‌లో డ్యాన్సులు వేయాలంటూ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్ సమయంలో వీడియోలు తీసి వాట్సప్ గ్రూపులలో షేర్ చేసి కామెంట్స్ చేయడంతో క్లాస్ రూంలలో ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ప్రొఫెసర్లకు చెపితే ఎక్కడ సీనియర్లు తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తారో అని భయపడిపోయారు. చివరకు మీడియాను ఆశ్రయించారు. ర్యాగింగ్ అంశం బయటకి రావడంతో ఎంక్వయిరీ చేసిన యూనివర్సిటీ అధికారులు.. 10 మంది విద్యార్థినులను క్రమశిక్షణ చర్యలలో భాగంగా 15 రోజుల పాటు సస్పెండ్ చేశామన్నారు.

Read Also: Kurnool: ప్రాణాల మీదకు తెచ్చిన వింత పందెం.. బతికున్న చేపను మింగాలంటూ..

Show comments