Rafael Nadal Retirement: పరాజయంతో కెరీర్‌ను ముగించిన ‘స్పెయిన్ బుల్’!
- రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది
- నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ 2-1 తేడాతో ఓటమి
- కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పెయిన్ బుల్, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. డేవిస్ కప్ 2024లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ 2-1 తేడాతో ఓటమిపాలవ్వడంతో రఫా తన కెరీర్‌ను ముగించాడు. ముందుగా సింగిల్స్‌లో ఓడగా.. ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టు ఓడిపోవడంతో నాదల్‌కు ఆడే ఛాన్స్ దొరకలేదు. డేవిస్ కప్‌తో ఆటకు వీడ్కోలు పలుకుతానని గత అక్టోబర్‌లోనే రఫా ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్‌లో అద్వితీయ విజయాలు సాధించిన నాదల్.. తన పేరిట ఎన్నో రికార్డులు లిఖించుకున్నాడు.
రఫెల్ నాదల్ తన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ఓడిపోయాడు. నెదర్లాండ్స్ ఆటగాడు బొటిక్ వాన్‌డి జాండ్‌షల్ప్ చేతిలో 4-6, 4-6తో వరుస సెట్లలో ఓడిపోయాడు. స్పెయిన్ ప్లేయర్ కార్లోస్ అల్కారజ్ సింగిల్స్ మ్యాచ్‌లో విజయం సాధించినా.. అల్కారజ్, మార్సెల్ గ్రానోల్లర్స్ ద్వయం ఓటమితో డేవిస్ కప్‌లో స్పెయిన్ పోరాటం ముగిసింది. దాంతో రఫా కెరీర్‌కు ఎండ్ కార్డు పడింది. కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న నాదల్.. 2024లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకటి మాత్రమే ఆడాడు. డేవిస్ కప్‌కు ముందు ప్యారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచాడు.
Also Read
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Also Read: IPL 2025 Auction: ఆ భారత ఆటగాడిపై కన్నేసిన ఆర్‌సీబీ, సీఎస్‌కే.. కోట్ల వర్షమే ఇక!
రఫెల్ నాదల్ తన కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్, రెండు వింబుల్డన్, నాలుగు యూఎస్ ఓపెన్, రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి. ‘క్లే కింగ్’గా పేరుగాంచిన నాదల్ వీడ్కోలు సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఈరోజు నా జీవితంలో అత్యంత భావోద్వేగమైన రోజు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో చివరి సింగిల్స్ మ్యాచ్ ఆడేశా. చివరిసారిగా జాతీయ గీతాలాపన చేయడం ప్రత్యేకంగా ఉంది. నా కెరీర్‌లో సాదించిన టైటిళ్లతో నన్ను గుర్తు పెట్టుకుంటారు. చిన్న గ్రామం నుంచి వచ్చిన నన్ను ఓ మంచి వ్యక్తిగా గుర్తుపడితే ఆనందంగా ఉంటుంది. ఎప్పుడూ అండగా నిలిచిన మా కుటుంబానికి ధన్యవాదాలు’ అని నాదల్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!