Site icon NTV Telugu

Radhika Apte Pregnant: పెళ్లైన 12 ఏళ్లకు.. తల్లవుతోన్న టాలీవుడ్ హీరోయిన్!

Radhika Apte Baby Bump

Radhika Apte Baby Bump

Radhika Apte Pregnant: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆమె తల్లికాబోతున్నారు. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రాధికా నవంబర్‌లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. తాను తల్లి కాబోతున్న విషయాన్ని రాధికా ఇప్పటివరకు వెల్లడించలేదు. బుధవారం లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన కొత్త సినిమా ‘సిస్టర్‌ మిడ్‌నైట్‌’ ప్రీమియర్‌ షోకు హాజరయ్యారు. అక్కడ ఆమె బేబీ బంప్‌తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. రాధికా బేబీ బంప్‌ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

2012లో కెరీర్‌ మంచి ఊపులో ఉండగానే బ్రిటీష్‌ వయొలినిస్ట్‌ బెండిక్ట్‌ టేలర్‌ను రాధికా ఆప్టే వివాహం చేసుకున్నారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లి కాబోతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. వివాహం చేసుకున్న అనంతరమే రాధికాకు ఇంకా ఎక్కువగా ఆఫర్స్ వచ్చాయి. న్యూడ్‌, సెమీ న్యూడ్‌ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. పార్చ్‌డ్‌ సినిమాలో కొన్ని అశ్లీల సన్నివేశాల్లో నటించి మెప్పించారు.

Also Read: Spurious Liquor: కల్తీ మద్యం ఘటన.. 25కి చేరిన మృతుల సంఖ్య!

తమిళనాడులో జన్మించిన రాధికా.. థియేటర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ మొదలెట్టారు. హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్‌ సినిమాల్లోనూ నటించారు. లెజెండ్‌, లయన్‌, రక్త చరిత్ర వంటి సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

 

Exit mobile version