Site icon NTV Telugu

Rachel Gupta: మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ భారత మహిళదే..

Rachel

Rachel

అక్టోబర్ 25న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్‌ను భారత మహిళ గెలుచుకుంది. దేశ చ‌రిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్ న‌మోదైంది. దీంతో.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రేచల్ గుప్తా నిలిచారు. పంజాబ్ జలంధర్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్.. 70కి పైగా దేశాలకు చెందిన పోటీదారులను ఓడించింది. 2022లో మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్ టైటిల్ గెలుచుకోగా.. తాజాగా ప్రతిష్టాత్మక మిస్ గ్రాండ్ ఇండియా టైటిట్‌ను సొంతం చేసుకుంది. బ్యాంకాక్‌లోని MGI హాల్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. వారందరిని వెనక్కి నెట్టి రేచల్ ఈ ఘనత సాధించారు. అయితే.. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డును కూడా గెలుచుకుని మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా సరసన చేరింది.

Read Also: Minister Narayana: ఇసుక రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వితే కఠిన చర్యలు..

ఈ విజయాన్ని రేచల్ గుప్తా.. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్‌ను గెలుచుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్లో ఆమెకు మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు (10 లక్షల మందికి పైగా). మరోవైపు.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ సాధించడంతో.. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. రేచల్ విజయం దేశం గర్వించేలా ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 విజేతగా నిలిచిన రాచెల్ గ్లోబల్ అంబాసిడర్గా ప్రపంచ శాంతి స్థిరత్వంపై ప్రచారం కల్పిస్తారు.

Read Also: Transfers : రాష్ట్రంలో 70 మంది రెవెన్యూ అధికారుల బదిలీ

Exit mobile version