CP Sudheer Babu : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక సూచనలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని, ఉల్లంఘనలకు దిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఏడాది రాచకొండ పోలీస్ శాఖ 253 డ్రగ్స్ కేసులు నమోదు చేసిందని, 521 నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా రూ. 88 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్లు సుధీర్ బాబు వెల్లడించారు. ఇంకా, 30 మందికి జీవిత ఖైదు విధించడం ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ చలామణి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Kishan Reddy : రికమెండేషన్లకు తలొగ్గకుండా నియామక పత్రాలు
ఇంకా, లోక్ అదాలత్ ద్వారా 11 వేలకుపైగా కేసులను పరిష్కరించినట్లు పేర్కొంటూ, ప్రజల భద్రత కోసం పోలీసులు కృషి చేస్తుండటాన్ని ఆయన వివరించారు. అంతేకాకుండా.. మోహన్ బాబు ఘటనపై స్పందిస్తూ.. మోహన్ బాబు కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, మోహన్ బాబు వాళ్ళు టైం అడిగారు ఆ టైం తరువాత అవసరమైన చర్యలు చేపడతామన్నారు సీపీ సుధీర్ బాబు. అవసరమైతే మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని, బౌన్సర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. బౌన్సర్లకు ప్రత్యేక గైడ్లైన్సును రూపొందిస్తామని, బౌన్సర్లు తోపులాటలు చేసి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
PM Modi: ఒకటిన్నర ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలిచ్చాం..