యువతులు మరియు మహిళలకు భద్రత, సైబర్ భద్రత గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో “షీ ఫర్ హర్” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాచకొండ పోలీసులు ప్రకటించారు. షీ టీమ్స్ సభ్యులతో రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో కళాశాల విద్యార్థుల కోసం ‘షీ ఫర్ హర్ ప్రోగ్రామ్’ ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఒక్కో కళాశాల నుంచి ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేస్తారని ఆయన వెల్లడించారు.
Also Read : Covid19 : కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ఉపశమనం లేదా.. అయితే ఏం చేయాలి..?
చౌహాన్ షీ టీమ్స్ కార్యాలయాన్ని సందర్శించి, మహిళల భద్రతకు భరోసా కల్పించే చొరవలో భాగమైన డీసీపీ సలీమా మరియు కానిస్టేబుళ్లను కలిశారు. సైబర్‌స్టాకింగ్‌పై కూడా దృష్టి సారించాలని, నేరాలను అరికట్టేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈవ్-టీజర్లను పట్టుకోవడానికి నిరంతర పెట్రోలింగ్ మరియు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. బాలికలు మరియు మహిళల కోసం అన్ని విద్యా సంస్థలు, కార్యాలయాలు మరియు నివాస ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
Also Read : Air India: మరో వివాదంలో ఎయిరిండియా.. భోజనంలో రాయి.. ఫోటో వైరల్
