రాచకొండ పోలీసు కమిషనర్ గా జి. సుధీర్ బాబును ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. సీపీడీఎస్ చౌహన్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రస్తుతం సుధీర్ బాబు.. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. మూడు కమిషనరేట్స్ కో ఆర్డినేషన్ తో కలిసి పనిచేస్తాం.. ప్రజలకు ఎల్లవేళలా సేవలందిస్తామని అన్నారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తాం.. నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామని సుధీర్ బాబు పేర్కొన్నారు.
Read Also: Congress: పార్లమెంట్ భద్రతా లోపం, మా ఎంపీలు దుండగులను అడ్డుకున్నారు.. భద్రతా సిబ్బంది ఎక్కడ..?
అంతేకాకుండా.. మహిళల భద్రత పై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీపీ సుధీర్ బాబు చెప్పారు. పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ పై కూడా దృష్టి సారిస్తాం.. రిటైర్డ్ అయిన పోలీస్ అధికారుల సలహాలు కూడా తీసుకుంటాం.. ట్రాఫిక్ సమస్యలు రాకుండా నూతన టెక్నాలజీని ఉపయోగిస్తామన్నారు. నిబద్దతతో పనిచేస్తున్న అధికారులకు సహాయాసహకారాలు అందిస్తాం.. డ్రగ్స్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకుంటాం.. ల్యాండ్ కేసులపై ప్రత్యేక ద్రుష్టి సారిస్తామని పేర్కొన్నారు. కాగా.. రౌడీ షీటర్స్ పై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది.. సైబర్ క్రైమ్ నేరాల ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసి త్వరగతిన కేసులు చేదిస్తామని సీపీ సుధీర్ బాబు తెలిపారు.
Read Also: Tollywood Heros : బుల్లితెరపై కూడా హవాను కొనసాగిస్తున్న స్టార్ హీరోలు..
