NTV Telugu Site icon

Race car Accident: ప్రేక్షకుల మీదకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు మృతి.. వీడియో వైరల్..

Race Car Accident

Race Car Accident

వేగంగా వెళ్తున్న కారు రేస్‌ లోని ఓ కారు జనాలపైకి దూసుకెళ్లడంతో 27 మంది అక్కడికక్కడే గాయపడ్డారు. రేస్ నిర్వాహకులు వారిని ఆసుపత్రికి తరలించగా., చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 180 కి.మీ. దూరంలో ఉన్న ఫాక్స్ హిల్ ట్రాక్ పై రేస్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Also read: Telegram: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన టెలిగ్రామ్‌ సేవలు..

కోవిడ్ కారణంగా గత ఐదేళ్లుగా నిలిపివేయబడిన ఈ మోటారు ర్యాలీని శ్రీలంక సైన్యం ఇటీవల నిర్వహించింది. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం ఉండడంతో పెద్దెత్తున అక్కడికి వీక్షకులు చేరుకున్నారు. అయితే, ఒక ఘోర ప్రమాదం కారణంగా., ఈ రేసు మధ్యలోనే రద్దు చేయబడింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రేసింగ్ ట్రాక్ పై కారు బోల్తా పడినప్పుడు, రేస్ మార్షల్స్ పసుపు జెండాలతో వేగాన్ని తగ్గించమని ఇతర డ్రైవర్లను సూచించారు.

Also read:Summer : సమ్మర్ లో చికెన్ ను ఎక్కువగా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..

అయితే ట్రాక్‌ పై ఎర్రటి మట్టి ఉండడంతో దాని వాళ్ళ ఏర్పడిన ధూళి కారణంగా రేస్ కార్స్ డ్రైవర్లు పసుపు జెండాలను సరిగ్గా చూడలేకపోయారు. దీంతో మార్షల్స్ సిగ్నల్స్ పట్టించుకోకుండా కార్లు అతి వేగంగా నడుపుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. బోల్తా పడిన కారును ముందుగా ఢీకొన్న ఎర్రటి కారు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లడంతో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన దృశ్యాన్ని కూడా మనం వైరల్ గా మరీనా వీడియోలో చూడొచ్చు.